ప్రాణాలు పోతున్న తీరు మార్చుకోని రైతన్నలు మనుషుల ప్రాణాలతో చెలగాటం

 



ప్రాణాలు పోతున్న తీరు మార్చుకోని రైతన్నలు మనుషుల ప్రాణాలతో చెలగాటం



అన్నం పెట్టి ప్రాణం పోసే రైతన్నే రాష్ట ప్రజల ప్రాణాలకు కారణం అవుతున్నాడు


*రోడ్లపై వడ్లు మక్కలు పోయడాన్ని నిలిపివేసి తమ స్వంత పొలాల్లో పోసుకునేలా దృష్టి సారించి తక్షణమే చర్యలు చేపట్టాలని మండల తహసీల్దార్, ఎస్ఐ లకు ధర్మసమాజ్ పార్టీ మండల అధ్యక్షులు మహంకాళి రమేష్ వినతిపత్రం అందజేత*


ఇటీవల గత నాలుగు నెలల క్రితమే నర్సింగాపూర్ నుండి ఆబాది జమ్మికుంట వరకు అలాగే వీణవంక నుంచి మామిడాల పల్లి వరకు వడ్ల కుప్పల కారణంగా అనేకమంది యువకులు ప్రజలు ప్రాణాలు కోల్పోతున్న వేళ రైతులు తమ తీరును మార్చుకోకుండా రోడ్లపై వడ్లు, మక్కలు పోస్తూ అదే రోడ్లపై ట్రాక్టర్ సహాయంతో మక్కలు పట్టడం ద్వారా రవాణా వాహనదారుల కళ్ళలోకి ఆ దుమ్ము వెళ్లి అనేక అనారోగ్యాలకు గురవుతూ మరియు ఆ దుమ్ము వలన ముందు వచ్చే వాహనాలు కనబడక అనేక ఆక్సిడెంట్లు జరుగుతూ ఆయా కుటుంబాలు ఆక్సిడెంట్ల పాలై ప్రాణాలు పోతూ రోడ్డున పడుతున్నాయని ధర్మ సమాజ్ పార్టీ మండల అధ్యక్షులు రమేష్ గారు వీణవంక మండలం ఎమ్మార్వో మరియు ఎస్ఐ గారికి వినతి పత్రం అందజేస్తూ రైతులు తమ సొంత పొలాల్లోనే వడ్లు, మక్కల కుప్పలు పోసుకోకునేలా దృష్టి సారిస్తూ వీటిపై కఠిన చర్యలు చేపట్టాలని తెలిపారు..


దేశానికి రెండు కళ్ళ లాంటివారు సైనికులు మరియు అన్నం పెట్టే రైతన్నలు అయితే అలాంటి రైతన్నలే రోడ్లపై వడ్లు, మక్కలు పోస్తూ ప్రజల ప్రాణాలకు కారణమవుతున్నారు.కడుపు నింపి ప్రాణం నిలబెట్టే రైతన్నే రాష్ట ప్రజల ప్రాణాలు తీస్తున్నాడు. అన్నం పెట్టే రైతన్న రోడ్లపై బట్టలు పోస్తూ ప్రజల యొక్క ప్రాణాలను తీసే రైతులుగా రాష్ట మరియు దేశ చరిత్రలో నిలవడం అనేది చాలా దారుణమైన చర్యగా భావిస్తున్నామని తెలిపారు. కొంతమంది మిల్లర్లు హమాలీ కూలీలతో కుమ్మక్కై వాహనాలు పొలాల్లోకి వెళితే చాలా దూరం ఇబ్బంది అవుతుందని హమాలీలకు కమిషన్ల ఆశచూపి ప్రజలు నిరంతరం ప్రయాణం చేసే రవాణా రోడ్లపై వడ్లను పోయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ఇకనైనా రైతులు మేల్కొని రోడ్లపై వడ్లు, మక్కలు పోయకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజల రక్షణ బాగు కోసం కృషి చేయాలని ధర్మసమాజ్ పార్టీ రాష్ట్ర ప్రజల రైతులను కోరుకుంటుంది.రైతులు పట్టించుకోని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా దీనిపై దీక్షలు ధర్నాలు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు శ్రీనివాస్ యాదవ్ ప్రధాన కార్యదర్శి తిరుపతి గౌడ్ కార్యదర్శి కుమార్ మండల కమిటీ సభ్యులు సదానందం నరేష్ పృథ్వీరాజ్ రాజు వినోద్ రమేష్ వినయ్ అనిల్ శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు..

Post a Comment

Previous Post Next Post

Contact Form