అకాల వర్షంతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
రైతు ప్రజా సంఘాల సమస్య జాతీయ అధ్యక్షుడు రామారావు
కరీంనగర్ జిల్లాలోని మానకొండూరు వీణవంక శంకరపట్నం జమ్మికుంట మండలాల్లో అకాల వర్షంతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని రైతు సంఘాల సమైక్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు డిమాండ్ చేశారు ఆయా మండలాల్లో పర్యటించిన ఆయన వీణవంకలో మాట్లాడారు అకాల వర్షంతో రైతుల ధాన్యం తడిసి నష్టపోయారని అన్నారు అలాగే ఈదురుగాలులకు మామిడి తోటల్లో కాయలు నేలరాలి రైతులు తీవ్రంగా నష్టపోయారని అన్నారు అధికారులు గ్రామాల్లో వెంటనే సర్వే చేసి పరిహారం అందించాలని అన్నారు